Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వామపక్షాలు, లౌకిక, సామాజిక శక్తులను సంఘటితం చేస్తాం
- బీజేపీ మతోన్మాద, నియంతృత్వ విధానాలతో భవిష్యత్తు చీకటి
- ఎస్సీ,ఎస్టీ,బీసీ,ఎంబీసీలను అణగదొక్కేదే మనువాదం
- సామాజిక, సాంస్కృతిక రంగాల్లోనూ నిరంతర కృషి
- టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై సమరశీల పోరాటం
- కాళేశ్వరం నిర్మాణంతోనే రాష్ట్రమంతా సుభిక్షం కాదు
- ఓటరు చైతన్యంపై దీర్ఘకాలిక ప్రణాళిక
- పార్టీ బలోపేతంపై మహాసభలో దిశానిర్దేశం : నవతెలంగాణతో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
రాష్ట్రంలో వామపక్ష పార్టీలు, లౌకిక శక్తులు, సామాజిక శక్తులను సంఘటితం చేసి ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నిర్మిస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. బీజేపీ బలపడకుండా, విస్తరించకుండా, ఎన్నికల్లో గెలవ కుండా చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతో న్మాదం, నియంతృత్వ విధానాలతో భవిష్యత్తు చీకటిమయం అవుతుందనీ, దీన్ని ప్రతి పౌరుడూ తెలుసుకోవాలని అన్నారు. ఎన్నికల్లో బీజేపీని ఓడిం చడమే కాకుండా సామాజిక, సాంస్కృతిక రంగంలోనూ నిరంతరం కృషి చేయనున్నామని వివరించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలనను కొనసాగిస్తున్నదని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు, కేసీఆర్ ఇచ్చిన హామీల అమలుకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించి సమరశీల పోరాటాలకు సన్నద్ధమవుతామని చెప్పారు. తమ పార్టీ బలోపేతంపై ఈ మహాసభలో చర్చించి శ్రేణులకు దిశానిర్దేశం చేస్తామని అన్నారు. శనివారం నుంచి 25 వరకు రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లో జరుగుతున్న సీపీఐ(ఎం) రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు తమ్మినేని వీరభద్రం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు...
కోవిడ్ మూడోదశ నేపథ్యంలో మహాసభ ఏర్పాట్లు, దాని నిర్వహణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
కరోనాకేసులు తక్కువున్నాయి కాబట్టి పోలీ సులు మహాసభల నిర్వహణకు అనుమతిచ్చారు. అన్ని ఏర్పాట్లూ పకడ్బందీగా చేస్తున్నాం. రెండు వేల మంది పట్టే హాల్లో 400 మంది ప్రతినిధులు హాజరవుతారు. భౌతికదూరం పాటిస్తాం. అందరూ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకుని మహాసభకు హాజరవుతారు. ఈనెల 23న ప్రతినిధుల సభ ప్రారంభమయ్యేరోజు రాపిడ్ ఆంటీజెన్ టెస్టులు చేస్తారు. నెగెటివ్ వచ్చినా వారికే అనుమతి ఉం టుంది. మహాసభ మధ్యలో ఎవరికైనా కరోనా వస్తే ఐసోలేషన్ కేంద్రం సిద్ధంగా ఉంచాం. అంబులెన్స్ రెడీగా ఉంది. ప్రతి ప్రతినిధికీ మూడు మాస్క్‌లు, శానిటైజర్ బాటిల్ ఇస్తాం. డాక్లర్ల బృందం నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది ఉండబోదని భావిస్తున్నాం.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మహాసభ ప్రాధాన్యతను వివరించండి?
దేశంలో, రాష్ట్రంలో సంక్లిష్టమైన రాజీయ వాతా వరణం ఉన్నది. ఏడేండ్లలో మోడీ ప్రభుత్వం నిరంకుశంగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరి స్తున్నది. రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నది. ముస్లింల పట్ల ద్వేషాన్ని పెంచుతున్నది. ఇటీవలి కాలంలో మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్య మాలు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమం జయప్రదమైంది. మూడు నల్లచట్టాలను రద్దు చేయడం సానుకూల విషయం. కార్మిక కోడ్ల వల్ల కార్మికవర్గంలో అసంతృప్తి ఉన్నది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఓడిపోయే పరిస్థితి ఉన్నది. ఈ పరిణామాలన్నింటి దృష్ట్యా ఈ మహా సభకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. కేసీఆర్ సర్కారు అనుసరిస్తున్న విధానాలపైనా ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. పోడు భూముల పోరాటం, ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆందోళనలు, కార్మికవర్గం సమ్మెలు జరిగాయి. ఇంకా జరుగుతాయి. కేసీఆర్ దిగొచ్చి పోడు పట్టాలిస్తామన్నారు. ఆశాలకు జీతాలు పెంచారు. రాబోయే కాలంలో ఈ పోరాటాలు మరింత పెరుగుతాయి. భవిష్యత్తులో ప్రజలను సమీకరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటాలకు రూపకల్పన చేసేలా మహాసభల్లో చర్చించి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వామపక్ష పార్టీలు, లౌకిక శక్తులు, సామాజిక శక్తులను సంఘటితం చేసి ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నిర్మిస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. బీజేపీ బలపడకుండా, విస్తరించకుండా, ఎన్నికల్లో గెలవకుండా చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాదం, నియంతృత్వ విధానాలతో భవిష్యత్తు చీకటిమయం అవుతుందనీ, దీన్ని ప్రతి పౌరుడూ తెలుసుకోవాలని అన్నారు. ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే కాకుండా సామాజిక, సాంస్కృతిక రంగంలోనూ నిరంతరం కృషి చేయనున్నామని వివరించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలనను కొనసాగిస్తున్నదని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు, కేసీఆర్ ఇచ్చిన హామీల అమలుకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించి సమరశీల పోరాటాలకు సన్నద్ధమవుతామని చెప్పారు. తమ పార్టీ బలోపేతంపై ఈ మహాసభలో చర్చించి శ్రేణులకు దిశానిర్దేశం చేస్తామని అన్నారు. శనివారం నుంచి 25 వరకు రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లో జరుగుతున్న సీపీఐ(ఎం) రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు తమ్మినేని వీరభద్రం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు...
కోవిడ్ మూడోదశ నేపథ్యంలో మహాసభ ఏర్పాట్లు, దాని నిర్వహణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
కరోనా కేసులు తక్కువున్నాయి కాబట్టి పోలీసులు మహాసభల నిర్వహణకు అనుమతిచ్చారు. అన్ని ఏర్పాట్లూ పకడ్బందీగా చేస్తున్నాం. రెండు వేల మంది పట్టే హాల్లో 400 మంది ప్రతినిధులు హాజరవుతారు. భౌతికదూరం పాటిస్తాం. అందరూ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకుని మహాసభకు హాజరవుతారు. ఈనెల 23న ప్రతినిధుల సభ ప్రారంభమయ్యేరోజు రాపిడ్ ఆంటీజెన్ టెస్టులు చేస్తారు. నెగెటివ్ వచ్చినా వారికే అనుమతి ఉంటుంది. మహాసభ మధ్యలో ఎవరికైనా కరోనా వస్తే ఐసోలేషన్ కేంద్రం సిద్ధంగా ఉంచాం. అంబులెన్స్ రెడీగా ఉంది. ప్రతి ప్రతినిధికీ మూడు మాస్క్‌లు, శానిటైజర్ బాటిల్ ఇస్తాం. డాక్లర్ల బృందం నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది ఉండబోదని భావిస్తున్నాం.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మహాసభ ప్రాధాన్యతను వివరించండి?
దేశంలో, రాష్ట్రంలో సంక్లిష్టమైన రాజీయ వాతావరణం ఉన్నది. ఏడేండ్లలో మోడీ ప్రభుత్వం నిరంకుశంగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నది. రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నది. ముస్లింల పట్ల ద్వేషాన్ని పెంచుతున్నది. ఇటీవలి కాలంలో మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమం జయప్రదమైంది. మూడు నల్లచట్టాలను రద్దు చేయడం సానుకూల విషయం. కార్మిక కోడ్ల వల్ల కార్మికవర్గంలో అసంతృప్తి ఉన్నది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఓడిపోయే పరిస్థితి ఉన్నది. ఈ పరిణామాలన్నింటి దృష్ట్యా ఈ మహాసభకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. కేసీఆర్ సర్కారు అనుసరిస్తున్న విధానాలపైనా ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. పోడు భూముల పోరాటం, ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆందోళనలు, కార్మికవర్గం సమ్మెలు జరిగాయి. ఇంకా జరుగుతాయి. కేసీఆర్ దిగొచ్చి పోడు పట్టాలిస్తామన్నారు. ఆశాలకు జీతాలు పెంచారు. రాబోయే కాలంలో ఈ పోరాటాలు మరింత పెరుగుతాయి. భవిష్యత్తులో ప్రజలను సమీకరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటాలకు రూపకల్పన చేసేలా మహాసభల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. తెలంగాణ వచ్చాక మా పార్టీ కొంత బలహీనపడింది. ఓట్లు, సీట్లు తగ్గాయి. దాన్ని అధిగమించడానికి పార్టీ నిర్మాణంపై దృష్టిసారిస్తాం. శాఖలు, గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా పార్టీని బలోపేతం చేసే దిశగా చర్చ ఉంటుంది. ఉద్యమాన్ని సమీక్షించి రాబోయే మూడేండ్ల కాలానికి దిశానిర్దేశం చేసేలా ఈ మహాసభలుంటాయి.
సీపీఐ(ఎం) అఖిల భారత నాయకత్వం రాష్ట్రాల హక్కులు, సమాఖ్య స్ఫూర్తి కోసం కలిసి రావాలంటూ కేసీఆర్‌ను కోరింది. రాష్ట్రస్థాయిలో టీఆర్ఎస్ విధానాలపై మీ పార్టీ పోరాటాలు చేస్తున్నది. ఎలా చూడాలంటారు?
ఈ రెండూ పరస్పర విరుద్ధ అంశాలు కాదు. రాష్ట్రంలో బీజేపీని ఎదగకుండా చేయడం, దాన్ని వెనక్కి కొట్టడం మా లక్ష్యం. బీజేపీని వెనక్కి కొట్టడానికి కేసీఆర్ కలిసి వస్తే ఆహ్వానిస్తాం. అంతమాత్రాన ఎన్నికల అవగాహన, పొత్తు ఉంటుందని కాదు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ కొట్లాడాలి. కేంద్రం మతోన్మాదం, నియంతృత్వ విధానాలతోపాటు రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నది. గతంలో కాంగ్రెస్ హయాంలో ఇలాంటి చర్యలున్నా బీజేపీ వచ్చాక మరింత వేగంగా పెరిగింది. జీఎస్టీ రూపంలో పన్నును, విద్యుత్ చట్టం తెచ్చి విద్యుత్‌రంగాన్ని కేంద్రం తీసుకుంటున్నది. ఉమ్మడి జాబితాలో ఉన్న వ్యవసాయాన్ని ఏకపక్షంగా లాగేసుకుని మూడు చట్టాలను తెచ్చింది. కార్మికులకు వ్యతిరేకంగా కోడ్లు తెచ్చింది. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. బయ్యారం ఉక్కుకర్మాగారం, ఐఐఎం వంటి కేంద్ర విద్యాసంస్థల స్థాపన, రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జాతీయహోదా ప్రకటించి నిధులు కేటాయిస్తామని చెప్పినా అమలు కాలేదు. కేంద్రం మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా కొట్లాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కేంద్రంపై కొట్లాడే అధికారాన్ని ప్రజలిచ్చారు. దాన్ని కేసీఆర్ అమలు చేయడం లేదు. ఇప్పుడిప్పుడే బీజేపీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నారు. ఆ పార్టీని ఓడించాలంటున్నారు. అయినా ప్రజలు నమ్మడం లేదు. కేసీఆర్ అక్కడ స్టాలిన్‌ను కలిసినా, తేజస్వియాదవ్‌తో ఇక్కడ భేటీ అయినా వారు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. కేసీఆర్ మాత్రం థర్డ్‌ఫ్రంట్ అంటున్నారు. బీజేపీ వ్యతిరేక ఓటను చీల్చే ప్రయత్నం అది. దాన్ని స్టాలిన్, తేజస్వీయాదవ్, అఖిలేష్ యాదవ్ అంగీకరించడం లేదు. కాంగ్రెస్‌తో కలిసుంటేనే బీజేపీని ఓడించగలమని వారంటున్నారు. కానీ కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ లేకుండా ప్రాంతీయ పార్టీలతో కూటమి కట్టాలని భావిస్తున్నారు. అది సాధ్యం కాకపోవచ్చు, ఒకవేళ సాధ్యమైనా ఎంత కాలముంటుందో తెలియదు. కేసీఆర్ చెప్పే మాట సీపీఐ(ఎం) చెప్పే విధానానికి భిన్నం. కాంగ్రెస్‌తో రాజకీయ సంఘటన ఉండకూడదు. కానీ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల మధ్య చీలిక రాకుండా చూడాలి. దానికి కేసీఆర్ సుముఖంగా లేరు.
ఈ మహాసభలో ఏయే అంశాలపై చర్చిస్తారు. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందంటారు?
రాష్ట్రాభివృద్ధి, ప్రజా సమస్యలు, కేసీఆర్ ఇచ్చిన హామీలపై ప్రధానంగా చర్చిస్తాం. తెలంగాణ వస్తే అందరికీ ఉద్యోగాలు, సాగు భూములన్నింటినీ నీళ్లు, మన నిధులు మనమే ఖర్చు చేసుకోవచ్చన్నారు. నీళ్లు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్తున్నారు. దానివల్ల 5,6 జిల్లాలకు తప్ప మిగతా జిల్లాలకు నీళ్లు రావు. ఉమ్మడి వరంగల్‌కు నీళ్లు రావాలంటే దేవాదుల, ఉమ్మడి ఖమ్మంకు నీళ్లు రావాలంటే సీతారామసాగర్, ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు నీళ్లు రావాలంటే కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు-రంగారెడ్డి, నల్లగొండకు మాధవరెడ్డి కెనాల్, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తి కావాలి. ఒక్క కాళేశ్వరం పూర్తయితేనే రాష్ట్రమంతా సుభిక్షం కాదు. ఇంటికో ఉద్యోగం అన్నారు. మూడు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ ద్వారా 36 వేల కొలువులు ఇచ్చారు. ఆర్థిక స్వావలంబన సాధ్యం కాలేదు. రూ.70 వేల కోట్లుగా ఉన్న అప్పు రూ.3 లక్షల కోట్లకు చేరింది. ఇలాంటి మూల సమస్యలపైనా చర్చించి తెలంగాణ అభివృద్ధికి ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందిస్తాం. ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్రజల ముందుంచుతాం. దళితులకు మూడెకరాల భూమి, ఉచిత విద్య, డబుల్బెడ్రూం ఇండ్లు, దళితబంధు పేరుతో రూ.10 లక్షలు, అన్ని కులాల్లోని పేదలకు రూ.10 లక్షల ఆర్థికసాయం చేస్తామని కేసీఆర్ హామీనిచ్చారు. నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అమలు చేస్తామన్నారు. ఇవేవీ అమలుకు నోచుకోలేదు. ఈ సమస్యలపై ప్రజలను సమీకరించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. ఈ రాష్ట్రంలో బీజేపీ వేగంగా విస్తరిస్తున్నది. ఎన్నికల్లోనే కాకుండా నిరంతరం ఆపార్టీ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తాం. సామాజిక, సాంస్కృతిక రంగాల్లో పోరాటాలను ఉధృతం చేస్తాం. మనువాదాన్ని, హిందువుల పేరుతో సెంటిమెంట్‌ను కాషాయపార్టీ రెచ్చగొడుతున్నది. హిందువుల్లో అగ్రకులాలకే బీజేపీ సిద్ధాంతం బాసటగా నిలుస్తున్నది. ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఎంబీసీలను అణగదొక్కేది మనువాద సిద్ధాంతం. వీటిని ఎదుర్కొవాలంటే సామాజిక శక్తులను ఐక్యం చేయాలి. ఆవుమాంసం తినొద్దని అంటున్నది. వీటికి వ్యతిరేకంగా సాంస్కృతికరంగంలో కృషి చేస్తాం. ఐక్యవేదికలను నిర్మిస్తాం.
వామపక్షాల ఐక్యత ప్రజా సమస్యలపై ఉంటుంది కానీ ఎన్నికలప్పుడు ఆ ఐక్యత ఉండదు. వామపక్షాలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజల్లో బలమైన అభిప్రాయం ఉన్నది. దీనిపై ఏమంటారు?
ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు కార్యక్రమం రూపొందించుకుని ఐక్య సంఘటన ఏర్పాటు చేయకపోవడమే దీనికి కారణం. అందుకే ఈ మహాసభల్లో ఆ సంఘటన ఏర్పాటు చేయడమే ముఖ్య లక్ష్యం. సీపీఐ(ఎం) ఎప్పటి నుంచో ఇందుకోసం కృషి చేస్తున్నది. అయినా కొన్ని పార్టీలు కలిపి రావడం లేదు. ఈసారి మరింత లోతుగా చర్చించి వామపక్ష పార్టీలను ఐక్యం చేసే ప్రయత్నం చేస్తాం. కొన్ని వైఫల్యాలు, కొన్ని విభేదాలు గతంలో ఉన్నా వామపక్ష ఐక్యత తప్ప రాష్ట్రానికి మరో ప్రత్యామ్నాయం లేదు. ఆర్థిక విధానాలు, మతోన్మాద సిద్ధాంతం ఆ రెండు అంశాలకు ధీటుగా సిద్ధాంతపరంగా సమాధానం చెప్పే సత్తా, ప్రత్యామ్నాయం చూపే శక్తి వామపక్షాలకే ఉన్నది. కొన్ని అవాంతరాలున్నా వాటిని అధిగమించడం కోసం ప్రయత్నాలను ఉధృతం చేస్తాం. వామపక్షాలు కేంద్రంగా లౌకికశక్తులు, సామాజిక శక్తులను ఐక్యంచేసి ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నిర్మించేందుకు ఈ మహాసభ పిలుపివ్వబోతున్నది.
కమ్యూనిస్టు పార్టీలు సమస్యల పరిష్కారం కోసం చేసే ఉద్యమాలకు జనం నుంచి భారీ స్పందన వస్తుంది. కానీ ఎన్నికల్లో ఆ పార్టీలకు ఓట్లు మాత్రం రావు. వారిని ఓటర్లుగా మార్చుకోవడంలో వైఫల్యం ఎక్కడుందంటారు?
ఎన్నికల స్వరూపం మారింది. గతంలో ప్రజలకు సేవ చేసిన వారిని, సమస్యలపై పోరాడే వారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునే వారు. ఇటీవల సమాజంలో పెద్ద మార్పు వచ్చింది. ప్రతిదీ డబ్బుమయం అయ్యింది. ఓటు సరుకుగా మారింది. రాజకీయాలు వ్యాపారంగా మారాయి. ప్రజాజీవితంతో సంబంధం లేనివారు వందల కోట్లు సంపాదించిన వారు సూట్‌కేసులతో వచ్చి నామినేషన్ రోజు వచ్చినా అతన్ని గెలిపించే పరిస్థితి వచ్చింది. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టలేని పార్టీలకు, ఆ విధానం లేని వారికి గెలుపు సాధ్యం కావడం లేదు. దీనికి దీర్ఘకాలిక కార్యాచరణను రూపొందిస్తున్నాం. ఓటరు చైతన్యంపై పెద్దకార్యక్రమాన్ని చేపట్టాలని మహాసభ నిర్ణయిస్తుంది. సదస్సులు, సభలు, సాహిత్యం, ఓటు విలువ, ఓటు అమ్ముకోవడం తప్పు ఎలా అనేదానిపై నిరంతరం ప్రచారం చేస్తాం. డబ్బు ప్రభావం చూపినా నిత్యజీవిత సమస్యలు ప్రధానంగా ఉన్నపుడు డబ్బును లెక్కచేయకుండా ఓటు వేసిన సందర్భాలున్నాయి. మోడీ విధానాలపైనా, కేసీఆర్ విధానాలపైనా ప్రజల్లో కదలిక కనిపిస్త్తున్నది. బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో ఓడిపోయింది. రాబోయే ఐదు రాష్ట్రాల్లోనూ ఓడిపోయే పరిస్థితి ఉన్నది. టీఆర్ఎస్ కొన్ని ఉప ఎన్నికల్లో ఓడిపోతున్నారు. ఇవన్నీ చూస్తే ప్రజల్లో ఆలోచన ప్రారంభమైంది. దీన్ని ఉపయోగించుకుని అవసరమైన కార్యాచరణను రూపొందిస్తాం.
మహాసభల సందర్భంగా ప్రజలకు, పార్టీ శ్రేణులకు మీరిచ్చే సందేశం ఏంటీ?
మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ప్రస్తుత ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా దేశాన్ని మతంపరంగా చీల్చి చిచ్చుపెట్టే బీజేపీ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రతి పౌరుడూ ఆలోచించాలి. రాజ్యాంగ విలువలైన సెక్యులర్, ప్రజాస్వామ్యం, ఆర్థిక సార్వభౌమత్వం, సామాజిక న్యాయం, ఫెడరల్ వ్యవస్థ (రాష్ట్రాలకు ప్రత్యేక హక్కులు)ను కూల్చడానికి బీజేపీ బాహాటంగా ప్రయత్నం చేస్తున్నది. ఇది ఎన్నికల సమస్య కాదు. ఒక పార్టీ అధికారంలో నుంచి దిగడం, మరో పార్టీ రావడం అనేది కాదు. భవిష్యత్ తరాలకు చీకటిరాజ్యంగా కాకుండా మేల్కొవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ చైతన్యనాన్ని, పిలుపును మహాసభ ఇవ్వబోతున్నది.