Authorization
Tue April 08, 2025 06:59:05 am
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును రాష్ట్ర ప్రభుత్వం వచ్చేనెల నాలుగో తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో ఈనెల 30వ తేదీ వరకు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఫీజు చెల్లింపు గడువును ఆలస్య రుసుం లేకుండా ఈనెల 24 నుంచి వచ్చేనెల నాలుగో తేదీ వరకు పొడిగించామని తెలిపారు. ఆలస్య రుసుం రూ.200తో వచ్చేనెల పదో తేదీ వరకు, రూ.వెయ్యితో 17 వరకు, రూ.2 వేలతో 24 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశముందని వివరించారు. జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఫీజు తీసుకోవాలని కోరారు. ఏప్రిల్లో పరీక్షలుంటాయని తెలిపారు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు గతేడాది అక్టోబర్లో ప్రథమ సంవత్సరం పరీక్షలు రాశారని వివరించారు. వారు ఫస్టియర్ సబ్జెక్టులను ఇంప్రూవ్మెంట్ రాసేందుకు అనుమతి ఉందని పేర్కొన్నారు.