Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో 1/70 చట్టం ఉండేదని పేర్కొన్నారు. ప్రస్తుతం అది ఎక్కడా అమలు కావటం లేదని తెలిపారు. 317 జీవో తెచ్చి ఉద్యోగుల బదిలీల పేరుతో షెడ్యూల్ ప్రాంతా ల్లోకి గిరిజనేతర ఉద్యోగులను తెస్తున్నారని తెలిపారు. గిరిజన ద్రోహిగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లపై మొదటి సంతకం పెడతానన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో గిరిజనులకు 9.9 ఓట్ల శాతం ఉన్న గిరిజనులకు ఆ విధం గా రిజర్వేషన్లు ఎందుకు ఇయ్యలేదో చెప్పాలని ప్రశ్నించారు. రిజర్వేషన్లపై కేసీఆర్ వేసిన కమిషన్ రిపోర్ట్ ఇచ్చి ఐదేండ్లయిందని గుర్తుచేశారు.