Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • పదో తరగతి పరీక్ష రాసేందుకు వెళ్తూ విద్యార్థి మృతి
  • సూపర్‌ సైక్లోన్లతో భార‌త్‌కు తీవ్ర ముప్పు..!
  • నిలదీశామని కావాలని ఫెయిల్ చేశారు : విద్యార్థి
  • ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!
  • సీఐ సస్పెండ్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
నాలాల అభివృద్ధికీ అప్పులే.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

నాలాల అభివృద్ధికీ అప్పులే..

Sun 23 Jan 08:27:21.854619 2022

- ఇప్పటికే ఎస్‌ఆర్‌డీపీ, సీఆర్‌ఎంపీ పనులకు బ్యాంకు రుణాలు
- బల్దియా అప్పులు రూ.5 వేలకోట్లపైనే..
- రూ.858 కోట్లతో నాలా పనులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
'గ్రేటర్‌ హైదరాబాద్‌లో నాలాలు, డ్రయినేజీల అభివృద్ధి చేయాలంటే రూ.10 వేల కోట్లు అవసరం. అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చెరువుల పరిరక్షణ, వరదల నివారణకు చర్యలు తీసుకుంటాం' అని 2016 వరదల నేపథ్యంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. కానీ, ఐదేండ్లలో ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. డ్రయినేజీల నిర్మాణానికి నాలుగేండ్లుగా ఏటా రూ.300 కోట్లు ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ కోరినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. 2020లో భారీ వర్షాలు, వరదలకు నగరం అతలాకుతలమైంది. దీంతో ప్రభుత్వం రూ.858 కోట్లతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్‌ఎన్‌డీపీ)ను ప్రారంభించింది. కానీ గ్రేటర్‌లో పూర్తిస్థాయిలో నాలాలు, డ్రయినేజీలను అభివృద్ధి చేయాలంటే జీహెచ్‌ఎంసీ రూ.10 వేల కోట్లను ఖర్చు చేయలేని స్థితిలో ఉంది. సర్కార్‌ సైతం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. దీంతో అప్పులు చేయడమే బల్దియా ముందున్న కర్తవ్యమని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఎస్‌ఆర్‌డీపీ, సీఆర్‌ఎంపీ పనుల కోసం జీహెచ్‌ఎంసీ రూ.5 వేల కోట్లకుపైగానే అప్పులు చేసింది.
అధ్యయనాలతోనే..
జీహెచ్‌ఎంసీ పరిధిలోని నాలాల స్థితిగతులపై మరోసారి అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కిర్లోస్కర్‌ కమిటీ 2003లో నివేదిక ఇచ్చినప్పుడే వరద ముప్పునకు కారణాలను సవివరంగా అందజేసింది. నగరంలో చెరువులు కనుమరుగవ్వడం, నాలాలు, చెరువులు కుచించుకపోవడం, డ్రయినేజీల్లో చెత్తను, ఇతర వ్యర్థపదార్థాలను పడవేయడం, చెరువులు, నాలాలపై అక్రమ నిర్మాణాలు వచ్చాయని కమిటీ పేర్కొంది. ఇలాంటి చర్యల వల్లే నగరంలోని పలు ప్రాంతాలు భారీ వర్షాలకు, వరదలకు తట్టుకోలేని స్థితికి చేరుకున్నాయని కమిటీ గుర్తించింది. ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ వయాంట్స్‌ అనే కన్సల్టెన్సీతో 2007లో అధ్యయనం చేయించింది. కిర్లోస్కర్‌, వయాంట్స్‌ కమిటీల నివేదికలను పరిశీలించడంతోపాటు ఎన్‌సీపీ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో ఫీజుబులిటీ ఎంతవరకు ఉందనే అంశాన్ని గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు.
అప్పులు ఇలా..
జీహెచ్‌ఎంసీ నిర్వహించే పనులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 వేల కోట్ల అంచనాతో ఎస్‌ఆర్‌డీపీ, రూ.1839 కోట్లతో సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం (సీఆర్‌ఎంపీ), రూ.1500 కోట్లతో లింక్‌ రోడ్ల నిర్మాణ పనులను చేయాలని నిర్ణయించింది. కానీ వీటికయ్యే నిధులను మాత్రం సర్కార్‌ ఇవ్వకపోగా అప్పులు తీసుకుని పనులు చేయాలని ఉచిత సలహా ఇచ్చింది. అందులో భాగంగానే బాండ్ల ద్వారా రూ.495 కోట్లు, రూపీ టర్మ్‌లోన్‌ ద్వారా రూ.2,500 కోట్లు, సీఆర్‌ఎంపీ కోసం రూ.1,460 కోట్లను బ్యాంకు లోన్‌ ద్వారా సేకరించారు. దీంతోపాటు మధ్యలో ఆగిపోయిన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇండ్లను పూర్తిచేయడానికి మరో రూ.337 కోట్లు బ్యాంకు రుణం తీసుకున్నారు. అప్పులు భారీగా పెరిగిపోయి బల్దియా క్రెడిట్‌ రేటింగ్‌ దిగజారిందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బాండ్లు, బ్యాంకు రుణాలకు నెలకు రూ.30 కోట్లు వరకు వడ్డీ చెల్లిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నెలకు రూ.120కోట్లకుపైగా పెరిగే అవకాశముందని తెలిసింది.
ఎస్‌ఎన్‌డీపీకీ అంతే..
జీహెచ్‌ఎంసీ పరిధిలో నాలాలు, డ్రయినేజీ, చెరువుల లింకు అభివృద్ధి కోసం రూ.10 వేల కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ రూ.858 కోట్లు కేటాయించింది. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని పనులకు రూ.633 కోట్లు, శివారు మున్సిపాలిటీల్లోని పనులకు రూ.225 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. అయినా, జీహెచ్‌ఎంసీ పనులు పూర్తికావాలంటే అప్పులు చేయాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. అందుకోసం బ్యాంకు రుణం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆగస్టులోనే పోలీసు ప్రిలిమినరీ పరీక్షలు
కేంద్ర పథకాలతో రాష్ట్రానికి నిధులు
దావోస్‌లో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ
చివరికి ప్రభుత్వాస్పత్రికి...
భళా... సర్కారు బడి
యోగా డేను పండుగలా జరుపుకోవాలి
దమ్ముంటే మా ప్రభుత్వాన్ని రద్దు చేసి పోటీకి రండి
ఉపాధి హామీ పనుల్లో అపశృతి
ఆషా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
'పది' పరీక్షలకు 99.06 శాతం హాజరు
గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా 'శ్రీకాంత్‌ గౌడ్‌'
ఇంటర్‌లో ఆరు కొత్త కోర్సులు!
దేశానికే అభివృద్ధి నమూనా అందిస్తున్న కేసీఆర్‌
తెలంగాణ జాతి గర్వించదగ్గ....
సమాలోచన సభ
బీజేపీ బండ్రు శోభారాణి రాజీనామా
30న సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం
కుటుంబ పాలనతో రాష్ట్ర ప్రజలకు విసుగు :కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
గ్రూప్‌-1 దరఖాస్తుకు ఇంకా 4 రోజులే
ఏఐసీటీఈ ఆదేశాలను అమలు చేయొద్దు
విమానయాన రంగంలో పుష్కలంగా ఉద్యోగవకాశాలు
విద్యుత్‌ఘాతంతో గడ్డి, ట్రాక్టర్‌ దగ్ధం
సాహితీ ఆత్మగౌరవాన్ని చాటిన సురవరం : సీఎం కేసీఆర్‌
జులై 4 నుంచి అంబేద్కర్‌ వర్సిటీ పీజీ పరీక్షలు
వాహన సామర్థ్య పరీక్షలు షురూ
ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి
బీజేపీదే ఫ్యామిలీ ప్యాక్‌
దళితుల భూములు లాక్కోవద్దు
ధరాఘాతంపై ఆగ్రహం
నెల రోజులుగా కేంద్రాల్లోనే ధాన్యం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.