- విద్యుత్‌శాఖ మంత్రితో కాంట్రాక్టర్ల బేటీ నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్టులకు స్టాండెడ్ షెడ్యూల్డ్ రేట్స్ (యస్‌యస్‌ఆర్) పెంచాలని తెలంగాణా విద్యుత్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ విజ్ఞప్తి చేశారు. రెండు డిస్కంలలోనూ ఒకే రకమైన ధరలను సవరించాలని కోరారు. ఈ మేరకు ఆదివారం కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావులతో బేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు డిస్కంల మధ్య ఉన్న ధరల వ్యత్యాసాన్నీ వారు మంత్రికి వివరించారు. విద్యుత్ కాంట్రాక్టులకు అధికారులు రూపొందించే అంచనా వ్యయాల్లో పీఎఫ్, ఈఎస్‌ఐతో పాటు సెస్, కాంట్రాక్టర్ల అలవెన్స్‌ను కూడా కలపాలని కోరారు. భేటీలో అసోసియేషన్ అధ్యక్షుడు శివకుమార్, ప్రధాన కార్యదర్శి యస్‌కే మాజిద్, జాయింట్ సెక్రెటరీ సదానందం, ఆర్గనైజింగ్ సెక్రటరీ పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.