- తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(టీపీయుఎస్) వచ్చేనెల 12న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంత్ రావు, నవాత్ సురేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయులం దరినీ మానసిక సంక్షోభానికి గురిచేసిన ప్రభుత్వ వైఖరి అభ్యంతర కరంగా ఉందని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల వినతుల్ని ఏ మాత్రం ఖాతరు చేయకుండా వ్యవహరించటం ప్రభుత్వ ఉద్యోగ, ఉపా ధ్యాయుల వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. నిరసన తెలిపిన ఉపాధ్యాయుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నదని విమర్శిం చారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తలపెట్టిన ఉద్యమ కార్యాచరణలో భాగస్వాములు కావాలని కోరారు. జనవరి 26న ప్రతి నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వాలనీ, 28నుంచి 30వరకు సంతకాల సేకరణ చేయాలనీ, విజయవంతం చేయాలని వారు కోరారు. 31న సేకరించిన సంతకాలను గవర్నర్‌కు పంపాలనీ, ఫిబ్రవరి 12న మహాధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చారు.