- సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ నవతెలంగాణ-మర్కుక్ సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన మర్కుక్‌లో సమీకృత భవనాల కోసం ఆదివారం సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆదివారం స్థలం పరిశీలించారు. మర్కుక్ రెవెన్యూలో మండల బృహత్ పల్లె ప్రకృతి వనం పక్కనున్న 603 సర్వే నంబర్‌లోని 7 ఎకరాల భూమి గురించి సర్పంచ్ అచ్చంగారి భాస్కర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శితో పాటు అధికారులు సీఎం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ హన్మంతరావు, పంచాయతీ ముఖ్యకార్యదర్శి శరత్, డీపీవో కౌసల్యాదేవి, ఆర్డీవో ఇజేందర్ రెడ్డి, గడా ముత్యం రెడ్డి, డీఈ ప్రభాకర్ ప్రభాకర్, ఏఈ పాషా, తహసీల్దారు అహ్మద్ ఖాన్, ఎంపీడీవో వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ పాండుగౌడ్, జెడ్పీటీసీ యెంబరి మంగమ్మ రాంచంద్రం యాదవ్, ఉపసర్పంచ్ భరతమ్మ, ఎంఈవోసురేష్, కార్యదర్శి శాంతి, నాయకులు శ్రీధర్ రెడ్డి, ర్యాకం స్వామి తదితరులున్నారు.