- పుస్తకావిష్కరణలో ఎస్ వీరయ్య నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ కడవెండి ప్రజల వీరోచిత చరిత్రలి పుస్తకాన్ని సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు ఎస్. వీరయ్య ఆదివారం పార్టీ మహాసభల ప్రాంగణంలో ఆవిష్కరించారు. తొలి కాపీని శాసనమండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డికి అందించారు. పుస్తకావిష్కరణలో పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగళ్ళ భాస్కర్, తెలంగాణ సాహితీ ప్రధాన కార్యదర్శి ఆనందాచారి, నవతెలంగాణ పబ్లిషింగ్ హౌజ్ జనరల్ మేనేజర్ కోయ చంద్రమోహన్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.. ఆవిష్కరణ సందర్భంగా వీరయ్య, నర్సి రెడ్డిలు మాట్లాడుతూ ఈ పుస్తకం సాయుధ రైతాంగ పోరాటంలో కడవెండి గ్రామం, వారి పోరాటాలను, దొడ్డి కొమురయ్య అమరత్వాన్ని తెలియజేస్తుందన్నారు. ఈ గ్రంధాన్ని యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ పన్నీరు గ్రంథస్థం చేశారని తెలిపారు. సాయుధ పోరాటం గురించి తెలుసుకునే వారందరికీ ఇది ఒక పరిశోధన గ్రంథంగా ఉపయోగపడుతుందన్నారు.