Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) బడ్జెట్ రూపకల్పనకు ప్రత్యేకంగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించే విధంగా సన్నాహాలు చేయాలని అని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను, అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడిస్)లను ఆదేశించింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. గ్రీన్ బడ్జెట్‌కు 10 శాతం కేటాయించాలని కోరారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల బడ్జెట్ కౌన్సిల్ సమావేశాలకు కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీ) విధిగా హాజరు కావాలని సూచించారు.