Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలింపు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించి ప్రజలకు కుచ్చుటోపి తొడిగిన కార్వీ మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారధిని ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు పోలీసులు అరెస్టుచేసిన కార్వీ ఎండీని కోర్టు అనుమతితో పీటీ వారెంట్ క్రింద ఈడీ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. గతంలో కార్వీ తెలంగాణతో పాటు బెంగళూరు, ముంబాయి, ఢిల్లీలో అధిక వడ్డీని చెల్లిస్తామంటూ కోట్లాది రూపాయలను ప్రజల నుంచి డిపాజిట్లుగా సేకరించి చెల్లంపు సమయంలో వారిని మోసం చేసినట్టు కార్వీ ఎండీ పార్థసారధిపై అభియోగాలు వచ్చాయి. ఈ మేరకు హైదరాబాద్ సీసీఎస్‌తో పాటు బెంగళూరు, ముంబాయి, ఢిల్లీలలో పలు కేసులు పార్థసారధిపై నమోదయ్యాయి. దీనిపై తమ వంతుగా దర్యాప్తును ఇప్పటికే నగర సీసీఎస్ అధికారులు పూర్తి చేశారు. అనంతరం ఈ కేసు విచారణను ఈడీ చేపట్టింది. ముఖ్యంగా మనీలాండరింగ్ చట్టాన్ని కార్వీ ఉల్లంఘించినట్టు ఈడీ కేసు నమోదుచేసింది. దాదాపు మూడు వేల నుంచి ఆరుకోట్ల రూపాయల వరకు ప్రజల నెత్తిన కార్వీ కుచ్చుటోపి తొడిగినట్టుగా ఈడీ అనుమానిస్తోంది. ఈ మేరకు తాను సేకరించిన డిపాజిట్లను విదేశాలకు తరలించినట్టుగా కూడా ఈడీ దర్యాప్తులో వెలుగు చూసినట్టు తెలిసింది.