Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఆస్పత్రుల మరమ్మతుల కోసం రూ.10.84 కోట్లు వెచ్చించనున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సోమవారం హైదరాబాద్లో ఆయన ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందులో భాగంగా లేబర్ రూములు, డ్రైనేజీ, విద్యుత్ సరఫరా, ఇతర అన్ని రకాల మరమ్మతులు చేపట్టడటంతో పాటు ఆధునికీకరణ పనులు చేయనున్నట్టు చెప్పారు. నల్లగొండ, భద్రాద్రి- కొత్తగూడెం, సంగారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, నిర్మల్, కరీంనగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, యాదాద్రి- భువనగిరి, మెదక్, నాగర్ కర్నూల్, సిద్దిపేట జిల్లాల ఆస్పత్రులను మరమ్మతులు చేయనున్నామని వెల్లడించారు. సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ తదితరులు పాల్గొన్నారు.
కొత్తగా 20 బ్లడ్ స్టోరేజీ సెంటర్లు..
రాష్ట్రంలో కొత్తగా 20 బ్లడ్ స్టోరేజీ సెంటర్లు (రక్త నిల్వ కేంద్రాలు) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్కటి రు. 12 లక్షల ఖర్చుతో 12 జిల్లాల పరిధిలోని పలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల్లో వీటిని నెలకొల్పనున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 57 బ్లడ్ బ్యాంకులు ఉండగా, 51 బ్లడ్ స్టోరేజ్ సెంటర్లు ఉన్నాయి.