Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రచార ప్రకటనలు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వినియోగదారుల చట్టం 2019పై వినియోగదారుల వ్యవహారాల శాఖ రూపొందించిన ప్రసార ప్రకటనలను సోమవారం హైదరాబాద్లో రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ విడుదల చేశారు. ఎవరైనా తమకు అందుతున్న సేవల్లో లోపాలు గమనించినా.. ఇబ్బందులు పడ్డా వెంటనే ఆ శాఖని సంప్రదించాలని సూచించారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణలో ప్రచార చిత్రాలు దోహదం చేస్తామని మంత్రి గంగుల ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పౌరసరపరాల కమిషనర్ వి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.