Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్సవాలు నిర్వహించాలి: కాంగ్రెస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర మాజీ మంత్రి దామోదరం సంజీవయ్య శతజయంతి ఉత్సవాలను ఉభయ తెలుగు రాష్ట్రాలు నిర్వహించాలని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ దామోదరం సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్ ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. నీతి, నిజాయితీకి మారుపేరుగా సంజీవయ్య రాజకీయాల్లో గడిపారని గుర్తుచేశారు. నేటితరం రాజకీయ నాయకులు ఆ తరం నాయకులను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, హర్షకుమార్, పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.