Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
లాభాల్లో నడుస్తున్న సింగరేణి సంస్థను కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమ్మేందుకు కుట్రలు చేస్తున్నదని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పులు ఈశ్వర్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లోవిప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఎంపీ వెంకటేశ్నేతతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణకు కొంగు బంగారంగా ఉన్న సింగరేణి సంస్థ లక్షలాది కుటుంబాల్లో వెలుగును నింపుతున్నదన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే కార్య క్రమంలో భాగంగా సింగరేణిని కూడా అమ్మేం దుకు చర్యలు చేపడుతున్నదన్నారు. లాభాల బాటలో నడు స్తున్న బొగ్గు బ్లాకులను ప్రయివేటుపరం చేయడం దారుణమన్నారు.