Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బాలికల విద్య, రక్షణ, అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తున్నదని గిరిజ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మంత్రి వారికి సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్ కాలంలో విద్య ఆగిపోకుండా తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో 53 మహిళా రెసిడెన్సియల్ డిగ్రీ కాలేజీలు నడుస్తున్నాయని గుర్తుచేశారు. డపిల్లల విద్య ప్రోత్సాహానికి మరిన్ని కళాశాలలు పెంచేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో గ్రామాల్లో ఉన్న ఆడపిల్లల చదువులు ఆగిపోకూడదని విలేజ్ లెర్నింగ్ ప్రోగ్రాం కింద ఉపాధ్యాయులే విద్యార్థుల వద్దకు వెళ్లి పాఠాలు చెప్పే విధంగా, వారి సందేహాలు తీర్చే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ఆరోగ్య వంతమైన శిశువుకు జన్ననివ్వాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. అందుకు తగిన నిర్ణయాలు తీసుకున్నదని తెలిపారు.