Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉపాధ్యాయ సంఘాలు తలపెట్టిన ఆందోళనా కార్యక్రమాలకు రాజకీయ పక్షాలు కూడా మద్దతు అందించాలని సోమవారం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసీ) నాయకులు కోరారు. 317 ఉత్తర్వుల అమలు వలన నష్టపోయిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు న్యాయం కోరుతూ యుయస్పీసీ పక్షాన ఆందోళనలకు శ్రీకారం చుట్టినట్టు ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ (ఎంఎల్ ) న్యూడెమోక్రసీ నాయకులు కె రమ, కె గోవర్ధన్, సీపీఐ(ఎం), టీజేెఎస్ నాయకులను కలిసి మద్దతు కోరారు. ఈ మేరకు ఆయా పార్టీలు తమ మద్దతు తెలియజేశాయి. 29నాటి జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమానికి, వచ్చే నెల ఐదున హైదరాబాద్ లో నిర్వహించే మహాదర్నాలకు ఆయా పార్టీలు పాల్గొనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైస శ్రీనివాసులు (టీపీటీఎఫ్), ఎం. రఘుశంకర్ రెడ్డి, టి. లింగారెడ్డి (డీటీఎఫ్), యు. పోచయ్య, డి. సైదులు (ఎస్టీఎఫ్), సయ్యద్ షౌకత్ అలీ (టీఎస్పీటీఏ), ఎన్ యాదగిరి (బీటీఎఫ్), ఇ లక్ష్మణ్ నాయక్ (టీఎస్టీటీఎఫ్) పాల్గొన్నారు.