Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. టీఆర్ఎస్ సర్కారు అలసత్వంతోనే ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ఆలస్యం జరుగుతున్నదని తెలిపారు. కేంద్రం వివక్ష చూపిస్తున్నదని టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కొట్టి పారేశారు. 2014-15లో రూ.250 కోట్లు ఉన్న బడ్జెట్.. 2021-22లో 2,420 కోట్లకు చేరిందని కిషన్‌రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు.