Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పెద్దవాగు మినహా ఇతర ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించబోమని తెలంగాణ రాష్ట్రం స్పష్టం చేసింది. సోమవారం గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉప సంఘం సమావేశం జరిగింది. ప్రాజెక్టులను ఆధీనంలోకి తీసుకునే విషయంపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారులతో సమావేశమైంది. జీఆర్ఎంబీ సభ్య కార్యదర్శి బీపీ పాండే నేతృత్వంలో వర్చువల్ విధానంలో ఈ భేటీ జరిగింది. తెలంగాణ తరఫున సీఎంవో ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే సహా ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాము సమర్పించిన డీపీఆర్‌ల గురించి త్వరగా తేల్చాలని తెలంగాణ అధికారులు కోరారు. గెజిట్‌లో మార్పుల విజ్ఞప్తులను త్వరగా పరిశీలించాలన్నారు. నోటిఫికేషన్ లోని షెడ్యూల్ -2 లో పేర్కొన్న ఐదు ప్రాజెక్టులను తొలగించాలనీ, మరికొన్ని ప్రాజెక్టుల కాంపొనెంట్లను షెడ్యూల్ - 2 నుంచి షెడ్యూల్ -3లోకి మార్చాలని గతంలో విజ్ఞప్తి చేశామని గుర్తుచేశారు. వీటిపై జీఆర్ఎంబీ నుంచి గానీ, కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నుంచి స్పందన లేదని తెలిపారు. గెజిట్‌లో మార్పుల విజ్ఞప్తులను త్వరగా పరిశీలించాలన్నారు. మేడిగడ్డ ఆనకట్ట, దేవాదులను బోర్డు పరిధిలో చేర్చే అంశంపై కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తున్నది. అలాగే సీలేరు, ఇతర కాంపోనెంట్ల బోర్డు పరిధిలో చేర్చే అంశంపై భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం.