Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూలకంటి విజయలక్ష్మి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'నా భర్తను హత్య చేసిన కాంగ్రెస్ గూండాలే ఇప్పుడు నన్నూ బెదిరిస్తున్నారు. వారి అదిలింపులు, తాటాకు చప్పుళ్లకు భయపడబోను' అని జూలకంటి పులేందర్‌రెడ్డి భార్య, సీపీఐ(ఎం) మునగాల మండల కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి విజయలకిë చెప్పారు. సీపీఐ(ఎం) రాష్ట్ర మూడో మహాసభలో ప్రతినిధిగా పాల్గొన్న ఆమె తన అనుభవాలను 'నవతెలంగాణ'తో పంచుకున్నారు. ''నా భర్త చిన్నప్పటి నుంచి ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ కార్యక్రమాలకు ఆకర్షితులై అంచలంచెలుగా ఎదిగారు. నర్సింహుల గూడెం సర్పంచ్‌గా భారీ మెజార్టీతో గెలిచారు. నిత్యం ప్రజలతో మమేకమై అనేక పోరాటాలు నిర్వహిస్తున్న సమయంలో ఓర్వలేని కాంగ్రెస్ గూండాలు హుజూర్నగర్ అప్రోచ్ రోడ్డు వద్ద దారికాచి వెంటాడి, వేటాడి అత్యంత కిరాతకంగా కారుతో గుద్ది చంపారు. గ్రామ సర్పంచ్‌గా అనేక సేవలు అందించారు. ఊరి అభివృద్ధి కోసం అధికారులను కలిసేందుకు వెళ్తున్న ఆయనపై దారుణానికి ఒడిగట్టారు. ఆ సమయంలో నేను గృహిణిగానే ఉన్నాను. ఇద్దరు చిన్నపిల్లలు. నా భర్త మరణానికి కారణమైన వారిని వదిలిపెట్టబోను. కోర్టులో పోరాడుతున్నా. సాక్ష్యం చెప్పొద్దు..చెబితే నీ భర్త లెక్కనే నిన్నూ చంపేస్తాం అని బెదిరిస్తున్నారు'' అని చెప్పుకొచ్చారు. అయినా, పార్టీ ప్రోత్సాహంతో కోర్టులో పోరాడుతున్నాను. అధి కారాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ గుండాలు బెదిరిస్తున్నప్పటికీ తట్టుకుని నిలబడుతున్నాను. కేసు ట్రయల్‌కు వచ్చింది. మరోవైపు నా భర్త ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నాను. ఆయన చేసిన సేవలు నన్ను ఎంపీటీసీగా గెలిపించాయి. ఇప్పటికీ ఆయన సేవలను ప్రజలు గుర్తుకుంచుకున్నారు. నన్ను పార్టీ ఎంతో ప్రోత్సహిస్తున్నది. పార్టీ ఇచ్చిన స్ఫూర్తితో అడుగుటు ముందుకు వేస్తున్నాను' అని చెప్పారు.