Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విప్లవ స్ఫూర్తిని నింపిన సీపీఐ (ఎం) మహాసభ
- నవతెలంగాణ పుస్తకాల ఆవిష్కరణ
- మహాజన పాదయాత్ర ఆల్బమ్ విడుదల
- నేడు నూతన కమిటీ ఎన్నిక - ముగియనున్న మహాసభ
- కామ్రేడ్ సున్నం రాజయ్య నగర్ నుంచి బి.వి.యన్.పద్మరాజు
'నీవే..నీవే... వెలుగుదారైనవే...' అంటూ ప్రజానాట్య మండలి కళాకారులు సీపీఐ (ఎం) రాష్ట్ర మహాసభ వేదికపై ఆలపించిన ఈ పాట... రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లో కొనసాగుతున్న ఆ పార్టీ మహాసభకు సరిగ్గా సరిపోతుంది. దేశంలో, రాష్ట్రంలోనూ నెలకొన్న ప్రజా సమస్యలు, పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలు, మతోన్మాదం, ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణ, అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న ధరలు... తదితరాంశాలపై ప్రజలను చైతన్య పరుస్తూ, వారి జీవితాల్లో వెలుగు నింపే విధంగా సమరోత్సాహంతో కొనసాగుతున్న ఈ మహాసభ సోమవారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. ఇక్కడి కామ్రేడ్ సున్నం రాజయ్య నగర్ (కుంజా బొజ్జి, మస్కు నర్సింహ ప్రాంగణం)లో కొనసాగు తున్న ఈ సభ (ప్రతినిధుల)కు బి.వెంకట్, జూలకంటి రంగారెడ్డి, ఎస్.రమ, ఎమ్డీ జబ్బార్, తొడసం భీమ్రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలు, సమస్యలకు సంబంధించిన పలు తీర్మానాలను మహాసభ ఆమోదించింది. వాటిని సునిశితంగా పరిశీలిస్తూ పరిష్కార మార్గాలనూ చూపించింది. మహాసభలో నవతెలంగాణ బుకహేౌస్ ప్రచురించిన 'ఆరెస్సెస్ లోగుట్టు...', 'వామపక్షం - భారత స్వాతంత్య్రం' అనే పుస్తకాలను సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవిష్కరించారు. కార్యక్రమం లో సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్యతో పాటు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, బుకహేౌస్ జనరల్ మేనే జర్ కె.చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. గతంలో నిర్వహించిన మహాజన పాదయాత్ర కు సంబంధించిన ఆల్బ మ్ను పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ ఆవిష్కరించారు. బివి రాఘవులు, తమ్మినేని, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాల్గొన్నారు. పాదయాత్ర బృంద సభ్యులు కూడా హాజర య్యారు. ప్రజానాట్య మండలి కళాకారులు... ప్రతినిధులను ఉత్సాహపరిచే విధంగా ఉత్తేజ భరిత గీతాలను ఆలపిం చారు. 'ధరల దెబ్బ...' అనే అంశాన్ని ఇతి వృత్తంగా తీసుకుని ప్రదర్శించిన నాటిక ఆద్యంతం ఆకట్టుకుంది. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ర్యాగింగ్, లైంగిక, యాసి డ్ దాడులను వ్యతిరేకిస్తూ మేడ్చెల్‌కు చెందిన యువ కళాకా రులు నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. మరోవైపు చివరి రోజైన మంగళవారం మహాసభ నూతన రాష్ట్ర కమిటీని, నూతన కార్యదర్శిని ఎన్నుకోనుంది. అనంతరం వివిధ ప్రజా సమస్యలపై పోరాడేందుకు నిర్దేశించుకున్న కర్తవ్యాలను, అందుకనుగుణంగా కార్యాచరణను ప్రకటించనుంది.