Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 162.4 కిలోమీటర్ల విద్యుదీకరణ పూర్తయింది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల పరిధిలో గద్వాల్ -రాయచూర్ మధ్య 57.70 కిలోమీటర్లు, కోహీర్ డక్కన్ - ఖానాపూర్ మధ్య 60.40 కిలోమీటర్లు, తెలంగాణ - మహారాష్ట్ర రాష్ట్రాల పరిధిలో పింపల్కూటీ-కోసాయి మధ్య 44.30 కిలోమీటర్లు విద్యుదీకరణ పూర్తయినట్టు వెల్లడించింది.