Authorization
Tue April 08, 2025 05:10:19 am
- ఎమ్మెల్సీ కవిత ట్వీట్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మేడారం జాతరను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆమె మంత్రి సత్యవతి రాథోడ్ రాసిన తాజా లేఖలను జత చేస్తూ ట్వీట్ చేశారు. స్వరాష్ట్రంలో నాలుగు సార్లు జరిగిన జాతరకు సీఎం కేసీఆర్ రూ.332.71 కోట్లు విడుదల చేస్తే, కేంద్రం ఒక్క పైసా ఎందుకు విడుదల చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరును ఉద్దేశించి ప్రశ్నించారు. జాతీయ హౌదా ఇవ్వాలని రాష్ట్రం కోరినా కేంద్రం పట్టించుకోలేదని తెలిపారు. అసెంబ్లీ ఆమోదించిన గిరిజనులకు జనాభా ప్రాతపదికన 10 శాతం రిజర్వేషన్ల తీర్మానాన్ని ఆమోదించాలనీ, మేడారానికి జాతీయ పండుగ హౌదా కల్పించి, ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు.