Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్కేఎం ద్రోహ దినం ఆందోళనకు కార్మిక సంఘాల మద్దతు
- ఫిబ్రవరి 23,24లో దేశవ్యాప్త సమ్మెకు ఎస్కేఎం సంఘీభావం
న్యూఢిల్లీ : జనవరి 31న సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కే ఎం) పిలుపిచ్చిన ''ద్రోహ దినం'' ఆందోళనకు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. ఆ రోజున దేశవ్యాప్త బ్లాక్ డే నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ మేరకు సోమవారం సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్ టీయూసీ, హెచ్ఎంఎస్, టీయూసీసీ, సేవా, ఎల్పీఎఫ్ లతో పాటు స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. ''వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించినప్పటి నుంచి మేం పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం. ఈ ప్రకటన పట్ల సాధారణ స్పందన ఉప్పొంగుతుండగా, సంయుక్త కిసాన్ మోర్చా ఒక హెచ్చరికతో కూడిన వైఖరిని తీసుకుంది. ఇంకా చాలా ముఖ్యమైన డిమాండ్లు నెరవేర్చాల్సి ఉన్నది. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకునే చర్యలపై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించబడుతుంది'' అని తెలిపాయి. దురదృష్టవశాత్తూ, వ్యవసాయోత్పత్తులకు ఎంఎస్పీకి చట్టపరమైన హామీని పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం, విద్యుత్ (సవరణ) బిల్లు, ఉపసంహరణ, రద్దు చేయడం వంటి రాతపూర్వకంగాకి చేసిన వాగ్దానాలపై ప్రభుత్వం తలొగ్గుతున్నట్టు కనిపిస్తోంది. అజరు మిశ్రా తేని, లఖింపూర్ ఖేరీ అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్, రైతుల రాయిలాంటి సంకల్పం ముందు ప్రధానమంత్రి ప్రతిష్టను నివృత్తి చేయడానికి, సిగ్గులేకుండా మేము ఎల్లప్పుడూ చట్టాలను రూపొందిస్తామని అంటున్నారు'' అని పేర్కొన్నాయి. ''అందువల్ల, జనవరి 31ని ''ద్రోహ దినం''గా పాటించాలనే నిర్ణయం సరైనదే. జాతీయ ఆస్తుల హౌల్సేల్ ప్రయివేటీకరణతో కూడిన కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, దేశ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 23,24ల్లో మేము ఇచ్చిన దేశ వ్యాప్త సమ్మె పిలుపుకు మద్దతు ఇవ్వడానికి ఎస్కే ఎం తీసుకున్న నిర్ణయానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జనవరి 31ని బ్లాక్ డేగా పాటించేందుకు వీలుగా తమ సంఘీభావాన్ని అందించాలని దేశంలోని మా యూనియన్లకు మేము పిలుపునిస్తున్నాం'' అని పేర్కొన్నాయి.