Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి వైద్యారోగ్యశాఖ నివేదిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ప్రభావం మరో 10రోజుల వరకు ఉండవచ్చని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు సమాచారం. కోవిడ్ పరిస్థితు లను బట్టి జిల్లాల వారీగా చర్యలు తీసుకుంటే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఫిబ్ర వరి ఐదు నుంచి స్కూళ్లు కాలేజీలను తెరిచేం దుకు అనుమతించవచ్చని సూచించినట్టు తెలుస్తున్నది. షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు నిర్వహించుకోవచ్చని ఆ నివేదికలో పేర్కొన్నారు.