Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజ్యాంగ నిర్మాత, మహనీయులు, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు, పరిశోధనలు, ఉపన్యాసాలు, జీవితచరిత్రకు సంబంధించిన పుస్తకాలు, సాహిత్యాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకుపోవాలని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పులఈశ్వర్ చెప్పారు. ఆలిండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి వెంకట స్వామి, ఉపాధ్యక్షుడు వైద్యనాథ్ మంగళవారం మంత్రి కొప్పులఈశ్వర్ ను కలిశారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ రాసిన పుస్తకాలు, ముఖ్యమైన సందర్భాలలో చేసిన ఉపన్యాసాలు, ఇతరులు రాసిన పుస్తకాలు, గ్రంథాలు, సాహిత్యాన్ని మరింతగా ప్రచురించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు అంబేద్కర్ 1927లో స్వయంగా నెలకొల్పిన తమ సమతా సైనిక్ దళ్ కార్యాలయం కోసం హైదరాబాద్ నగరంలో ఒక భవనాన్ని కేటాయించాలని, రాష్ట్రంలో నిర్మాణంలో కమ్యూనిటీ హాళ్లను త్వరితగతిన పూర్తి చేయించాలని కోరారు.