Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎల్ఎఫ్ 4వ ఆవిర్భావ సభలో ప్రొఫెసర్ ఖాసీం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో జనగణనలో బీసీ నగణన సాధించి నపుడే బహుజన రాజ్యాధికారం సాద్యమవుతుందిని ప్రొఫేసర్ ఖాసీం చెప్పారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) 4 వ ఆవిర్భావ ఆన్ లైన్ సభ మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర పోరాట కాలం నుంచి ఉద్దేశ్యపూర్వకంగా బీసీ సమాజాన్ని అగ్రవర్ణ ఆధిపత్య శక్తులు అణిచివేతకు గురిచేస్తున్నారని తెలిపారు.ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రిజర్వేషన్ తీసుకురావటంలో అంబేద్కర్ ప్రధాన బాధ్యత వహించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి బీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు సిద్ధిరాములు అధ్యక్షత వహించగా బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మద్దికాయల అశోక్, దండి వెంకట్, వనం సుధాకర్, రవి, ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.