Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఒగ్గు పూజారులకు తగిన గౌరవం కల్పించనున్నట్టు సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగిన అత్యవసర సమావేశంలో తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గోల్కొండ కోటలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఒగ్గుకళాకారులకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. గ్రామీణ వృత్తి కళాకారులతో పాటు ఒగ్గు కళాకారులకు సముచిత గౌరవాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. . ఒగ్గు పూజారుల ప్రతినిధులు, గొల్ల కురుమలు చేసిన అభ్యర్థన మేరకు కొమురవెల్లి మల్లన్న దేవాలయంలో పూజా విధానంలో గత ఆచారాలు, సాంప్రదాయాలనే కచ్చితంగా పాటించాలని, ఒగ్గు పూజారులకు ప్రాధాన్యత ఇవ్వాలనీ, పట్నాలు, కళ్యాణం సందర్భంలో ఓగ్గు సాంప్రదాయలనే మల్లన్న స్వామికి పూజలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ అధికారులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశంతో పాటు సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, కమిషనర్ అనిల్ కుమార్, దేవాలయ ఈవో బాలాజీ, దేవాలయం మాజీ ఛైర్మెన్ చేవెళ్ల సంపత్, కొలుపుల నర్సింహ కుర్మ , బండారు నారాయణ, చీరా శ్రీకాంత్, తుంకుంటా అరుణ్ కుమార్, 'బూరగడ్డ పుష్ప నగేష్ , ఒగ్గు ధర్మయ్య, ఒగ్గు రవి, మధు కుర్మ , మహిళా కమిటీ అధ్యక్షురాలు 'తమగొండ బాలమణి, సుగుణ, కళావతి,కాలే అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.