Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల తప్పిదం లేదు : డీఎస్పీ
నవతెలంగాణ-వేములపల్లి
ఎస్ఐ దురుసుగా ప్రవర్తించారని మనస్తాపానికి గురై మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటన మంగళవారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సల్కునూర్ గ్రామానికి చెందిన తుపాకుల అమ్ములు(17) గత నెల 9న ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అదే గ్రామానికి చెందిన బారి సైదులు తమ కూతురి ఫొటోలు తీసి అల్లరి చేయడంతో ఆత్మహత్య చేసుకుందని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో సైదులు వాలి ఇంటి మీదకు వెళ్లి గొడవ చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసింది. తెలిపారు. దీంతో భారీ సైదులు వారి ఇంటి మీదకు వెళ్లి గొడవ చేశారు. ఈ విషయమై ఈనెల 22న తన కూతురు ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్య తీసుకోవాలని అమ్ములు తల్లిదండ్రులు తుపాకుల సరిత-మల్లేష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని, కూతురి మృతికి కారణమైన వ్యక్తిపై చర్య తీసుకోవాలని కోరితే.. ఎస్ఐ దురుసుగా ప్రవర్తించారు. దీంతో మనస్తాపానికి గురైన సరిత సోమవారం రాత్రి ఎలుకల మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. తమ కూతురు ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని, తమపైదురుసుగా ప్రవర్తించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేశారు.
కుటుంబ విభేదాల వల్లే సరిత ఆత్మహత్యాయత్నం: డీఎస్పీ వెంకటేశ్వర్రావు
కుటుంబ విభేదాల వల్ల సరిత ఆత్మహత్యాయత్నం చేసుకుందని డీఎస్పీ వెంకటేశ్వర్రావు మంగళవారం తెలిపారు. వేములపల్లి ఎస్ఐ దురుసుగా ప్రవర్తించారనడం అవాస్తవమన్నారు. కుటుంబ కుటుంబ విభేదాల వల్ల ఎలుకల మందు తాగిందన్నారు. ఈ విషయంలో స్థానిక ఎస్ఐ రాజు ప్రమేయం కూడా లేదన్నారు. సరిత ఫోన్ సంభాషణల ఆధారంగా పోలీసుల తప్పిదం లేదని తెలిపారు.