Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపరాష్ట్రపతి పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారత దేశ నవ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ముందస్తుగా రికార్డు చేసిన వీడియో సందేశం ద్వారా మంగళవారం హైదరాబాద్ లో జరిగిన భారతమాత హారతి కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి తమ ప్రసంగాన్ని అందించారు. యువతరంలో దేశభక్తిని, స్ఫూర్తిని నింపాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సూచించారు. భారతదేశ సుసంపన్నమైన వారసత్వం మనందరికీ గర్వకారణమన్న ఆయన, రాబోయే తరాలు మన దేశ ఘనత గురించి తెలుసుకునేలా చేయడంతో పాటు, మన మాతృదేశ సర్వతోముఖాభివద్ధికి యువత కృషి చేయాలని సూచించారు.