Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
విధి నిర్వాహణలో అత్యుత్తమ సేవలు అందించిన రాష్ట్ర పోలీసు అధికారులకు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి పోలీసు పతకాలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఇందులో ఇద్దరు అధికారులకు రాష్రపతి పోలీసు పతకాలు లభించగా, మరో పదకొండు మందికి ఇండియన్ పోలీసు మెడల్స్ లభించాయి. రాష్ట్రపతి పోలీసు పతకాలు పొందిన వారిలో టీఎస్ఎస్పీ మూడవ బెటాలియన్‌కు చెందిన కమాండెంట్ చాకో సన్ని, పోలీసు ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ జి.శ్రీనివాసరాజుకు లభించాయి. అలాగే ఇండియన్ పోలీసు మెడల్స్ పొందిన వారిలో రాష్ట్ర మైనారిటీస్ వెల్పేర్ ఐజీపీ షానవాజ్ ఖాసిం. , సైబరాబాద్ అదనపు ఎస్పీ స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన అధికారి సంక్రాంతి రవికఁమార్, ఎఎస్పి పూల శోభన్కఉమార్, ఇంటెలిజెన్స్ ఎ ఎస్పి రాయప్పగారి సుదర్శన్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగానికి చెందిన డీఎస్పి పి.శ్రీనివాసరావు, , టెక్నికల్ విభాగం డీఎస్పి జి.శ్రీనివాస్‌లు, వనపర్తి డీఎస్పి. కెఎం కిరణ్‌కుమార్, ఇంటెలిజెన్స్ విభాగం ఆర్ఎస్ఐ యాకుబ్ ఖాన్, టీఎస్ఎస్పి ఏడవ బెటాలియన్ ఎఎస్ఐ బెండి సత్యం, గ్రేహౌండ్స్ ఆర్ఎస్ఐ మెట్టు వెంకటరమణారెడ్డి, ఎనిమిదవ బెటాలియన్ కొండపూర్ హెడ్‌కానిస్టేబుల్ ఐ కోటేశ్వశ్వరరావులకు లభించాయి. వీరికి రాష్ట్రపతిపతకాలు లభించినందుకు రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి అభినందనలు తెలియచేశారు.