Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొగుట
ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి కల్లు గీత కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం గోవర్ధనగిరి గ్రామంలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మరుపల్లి రామగౌడ్(57) ఈదులు గీసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. సోమవారం ఈత చెట్టుకు కల్లు ఇడువడానికి వెళ్లాడు. చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తోటి గీత కార్మికులు.. వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్థారించారు. మృతునికి భార్య, కొడుకు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు.