Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గంగాధర
కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనుల కోసం భూసేకరణ చేసేందుకొచ్చిన అదనపు కలెక్టర్‌ను రైతులు అడ్డుకున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామంలో అదనపు టీఎంసీ వరద కాలువ భూసేకరణ కోసం మంగళవారం గ్రామ సభ నిర్వహించారు. అక్కడికొచ్చిన జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ కాన్వారుని రైతులు అడ్డుకున్నారు. అదనపు భూసేకరణను ఆపాలని, వరద కాలువ తవ్వకానికి తమ భూములు ఇచ్చేదిలేదంటూ రోడ్డుపై బైటాయించారు. భూసేకరణను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. రైతులు ఒప్పుకోకుండా వరద కాలువ తవ్వకానికి బలవంతంగా భూములు సేకరణకు దిగడం సరికాదన్నారు. ఆందోళన విషయం తెలుసుకుని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం రైతుల వద్దకొచ్చి సంఘీభావం తెలిపారు.