Authorization
Tue April 08, 2025 06:36:42 pm
- ఇలాగే ఉంటే కరోనా మరింత తీవ్రం : హైకోర్టు
- కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలి
- 28న విచారణకు డీహెచ్ హాజరు కావాలని ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న తరుణంలో నియంత్రణ కోసం తీసుకునే చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని హైకోర్టు ఆం దోళన వ్యక్తం చేసింది. మాస్కులు ధరించడం లేదనీ, జనం గుంపులుగా ఉంటున్నారనీ, వీటిని అడ్డుకోక పోతే పరిణామాలు తీవ్రం అవుతాయని హెచ్చరిం చింది. కరోనాపై దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్రశర్మ, జస్టిస్ అభినంద ్కుమార్ షావిల డివిజన్ బెంచ్ విచారణ జరిగింది. ''మాస్కు లు, భౌతిక దూరం కూడా అమలు కాకపోవడం దురదృష్టకరం. ఇదే తీరుగా కొనసాగితే కరోనా వైరస్ మరింత తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉంటుంది. కోవిడ్ నిబంధనలను జీహెచ్ఎంసీ, పోలీసులు కఠి నంగా అమలు చేయాలి. కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలపై వివరణ ఇచ్చేందుకు డీహెచ్ శ్రీనివాసరావు తదుపరి విచారణకు హాజరు కావాలి. తదుపరి విచారణ ఈ నెల 28న జరుపుతాం.. '' అని ఉత్తర్వుల్లో హైకోర్టు పేర్కొంది. పిల్లలకు మందులు ఇవ్వడం లేదనీ, ఫీవర్ సర్వేలో జ్వరం ఉన్న వాళ్లందరికీ ఒకే తరహా ముందులు ఇస్తున్నారని పిటిషనర్లు లాయర్ పవన్ చెప్పారు. మూడు రోజుల్లో 1.78 లక్షల మంది జ్వర బాధితులు బయటపడటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ కిట్లలో పిల్లల చికిత్సకు అవసరమైన మందులు లేవన్నారు. మరో సీనియర్ లాయర్ రవిచందర్ వాదిస్తూ, మాస్కులు చాలా మంది పెట్టుకోవడం లేదని,భౌతిక దూరం పాటించడం లేదని చెప్పారు. రాష్ట్రం తరఫున అడ్వొకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ వాదిస్తూ, నీలోఫర్లోనే కాకుండా జిల్లాల్లో కూడా పిల్లలకు వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయని తెలిపారు. వాదనల తర్వాత హైకోర్టు.. ఈ నెల 28న జరిగే విచారణకు ఆరోగ్య విభాగం డైరెక్టర్ శ్రీనివాసరావు హాజరు కావాలని కోరింది. కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలు, పిల్లల కోసం వైద్య ఏర్పాట్లు, కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల అమలు గురించి స్వయంగా వివరించాలని డీహెచ్ని ఆదేశించింది.