Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య
- సీఎం కేసీఆర్ ఉద్యోగాలివ్వరని వాట్సాప్ స్టేటస్
నవతెలంగాణ-ఖమ్మం
మంచి చదువు చదువుకొని, ఉద్యోగం చేసి కుటుంబ సభ్యులను పోషించుకోవాలనే తపనతో ఖమ్మం నగరానికి వచ్చాడు ఓ యువకుడు. ఏండ్ల తరబడి కోచింగ్ తీసుకున్నాడు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకున్నాడు. ఎన్సీసీ ధృవపత్రం కూడా పొందాడు. ఉద్యోగం కోసం మూడేండ్ల నుంచి ఎదురు చూస్తున్నాడు. ఎంతకీ ఉద్యోగం నోటిఫికేషన్ వస్తలేదు. ఇక చావే శరణ్యమని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన మంగళవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారానికి చెందిన ముత్యాల సాగర్ (24) ఖమ్మంలోని ఓ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. ఎన్సీసీ శిక్షణ పొంది ధృవపత్రం కూడా పొందాడు. మూడేండ్లుగా ఖమ్మంలోని ఓ శిక్షణా సంస్థలో ప్రభుత్వ ఉద్యోగాలకు కోచింగ్ తీసుకుంటున్నాడు. కాగా ఎంతకీ నోటిఫికేషన్లు రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. 'ఇక నోటిఫికేషన్లు రావు. పిచ్చి లేస్తుంది. నా చావుకు కరోనా, సీఎం కేసీఆర్ కారణం' అంటూ వాట్సప్ స్టేటస్ పెట్టినట్టు అతడి స్నేహితులు తెలిపారు.