Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వింటా మిర్చి రూ.16,350
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం మిర్చి మార్కెట్‌కు వారం రోజులుగా క్రమేపీ మిర్చి పోటెత్తుతోంది. మంగళవారం 19,834 మిర్చి బస్తాలు మార్కెట్‌కు రాగా, ధర క్వింటాకు రూ.16,350లుగా జెండా పాట పలికిందని అధికారులు తెలిపారు. 886 ఏసీ మిర్చి బస్తాలు యార్డ్కురాగా, ధర రూ.16,500 పలికింది. అదేవిధంగా మార్కెట్ యార్డ్‌కు 5,421 పత్తి బస్తాలు రాగా, ధర క్వింటాకు రూ.9500 పలికింది.
మొరాయిస్తున్న పీవోఎస్ మిషన్లు..!
ఆరు ఏండ్ల కిందట ఆన్లైన్ పద్దతిలో గవర్నమెంట్‌కు రెవెన్యూ పెంచే విధంగా చేసిన ప్రణాళికలో భాగంగా దడవాయిలకు మంజూరైన పీవోఎస్ మిషన్ల వ్యాలిడిటీ అయిపోయింది. ఇంకా 3జీ సిమ్ వర్షన్ అనుసరించడంతో నెట్ సరిగ్గా రాకపోవడం, బ్యాటరీ బ్యాకప్ తగ్గిపో వడంతో బస్తాల ఆన్లైన్ నమోదు ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. 86 పీవోఎస్ మిషన్లకు గాను 60 మాత్రమే అందుబాటులో ఉన్నాయి.