Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాఖ్య భావనకు తూట్లు
- ఏఐఎస్ నిబంధనల మార్పు ద్వారా పెత్తనం చేసే యత్నం
- బీజేపీ, టీఆర్ఎస్ను ఒకేలా చూడం
- ప్రజాసమస్యలపై ఎవరితోనూ రాజీపడం : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్
కామ్రేడ్ సున్నం రాజయ్యనగర్
(తుర్కయాంజాల్) నుంచి బి.బసవపున్నయ్య
మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు రాష్ట్రాల హక్కులను వేగంగా హరిస్తున్నదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ విమర్శించారు. దేశంలో సమాఖ్య భావనకు తూట్లు పొడుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో ఇంకా విపరీత చర్యలకు పాల్పడుతున్నదని చెప్పారు. అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సర్వీసు నిబంధనలను మార్చడం ద్వారా రాష్ట్రాలపై హక్కులు, అధికారాలను తుడిచిపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రాలతో సంప్రదింపులు లేకుండానే ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తున్నదనీ, ఇది ప్రమాదకర సంకేతమని చెప్పారు. మంగళవారం సున్నం రాజయ్య నగర్ (తుర్కయాంజాల్)లో జరుగుతున్న సీపీఎం(ఎం) మహాసభల ప్రాంగణంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.జ్యోతి, జాన్‌వెస్లీ, నంద్యాల నర్సింహ్మారెడ్డి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగల్ల భాస్కర్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి. సామేల్, జగదీశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏఐఎస్ నిబంధనల మార్పు వల్ల అధికారులకు భద్రత ఉండదనీ, ఒత్తిడికి గురవుతారని ప్రకాశ్కరత్ వివరిం చారు. కేంద్ర నిబంధనల మూలంగా ఏఐఎస్‌లపై రాష్ట్రాల పర్యవేక్షణ ఉండకుం డా పోతుందని గుర్తుచేశారు. ఈచర్యలను బీజేపీయేతర రాష్ట్రాలు వ్యతిరేకించా యని చెప్పారు. కీలకమైన అధికారులను చెప్పుచేతుల్లో పెట్టుకునేందకు మోడీ సర్కారు కుయుక్తులకు పాల్పడతున్నదని వివరించారు. అధికారాలను కేంద్రీకరణ చేసే కుట్రలో భాగమే సర్వీసు నిబంధనలను సవరించేందుకు పూనుకుందన్నారు. తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం సైతం వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాసిం దని చెప్పారు. పశ్చిమబెంగాల్, కేరళ, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు తదితర రాష్ట్రాలు ఇందులో ఉన్నాయని తెలియజేశారు. రాష్ట్రాల ఆర్థిక ఇబ్బందులను పట్టించుకోవ డం లేదనీ, గ్రాంట్లు ఇవ్వడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదంటూ తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి కేంద్రానికి లేఖ రాశారనీ, జీఎస్టీ పరిహా రాలు కూడా ఇవ్వలేదని అందులో చెప్పారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో బీజేపీకి, మోడీకి మద్దతు ఇస్తూ వస్తున్నదనీ, ఆలస్యంగానైనా వ్యతిరేకించే పనికి పూనుకుందనీ,.దీనిపై స్థిరంగా నిలవాలని సూచించారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలనీ, అప్పుడే తెలంగాణ ప్రయోజనం చేకూ రుతుందని అభిప్రాయపడ్డారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని స్ప ష్టం చేశారు. పది రోజుల క్రితం కేంద్ర కమిటీ సమావేశాలు హైదరాబాద్‌లోనే జరి గాయని, బీజేపీని ఓడించడమే లక్ష్యంగా తీర్మానం చేశామని గుర్తుచేశారు. ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో కలిసి పనిచేస్తామనీ, బీజేపీని ఓడించే సత్తా ఆపార్టీకే ఉందన్నారు. వచ్చే ఫిబ్రవరిలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుందనీ, దానిలో కరోనా కాలంలో మొదటి నుంచి ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉత్పత్తి రంగం మెరుగుపడలేదనీ, ప్రజల కొనుగోలు శక్తి ఇంకా తగ్గింద న్నారు. దీనికి బీజేపీ ఆర్థికవిధానాలు సరిగ్గాలేకపోవడమే కారణమని వివరిం చారు. ప్రజల చేతికి డబ్బు అందించాలనీ, వారి కోసం ఉపాధి అవకాశాలను మెరు గుపరచాలని కోరారు. కరోనా తొలినాళ్లల్లోనే ప్రతి కుటుంబానికి రూ. 7,500 చొప్పున ఇవ్వాలని 16 పార్టీలు కోరాయనీ, మోడీ ప్రభుత్వం ఆ విజ్ఞప్తిని పెడచెవిన పెట్టిందన్నారు. అమెరికాతోపాటు ఇతర దేశాల్లోనూ ఈ తరహా జీవనభృతిని అమలైందని గుర్తు చేశారు. పేదలకు సహాయం చేయడానికి నిరాకరించిన మోడీ ప్రభుత్వం, కార్పొరేట్లకు మాత్రం లక్షల కోట్ల సబ్సిడీలను అమలుచేసిందనీ, పన్ను లూ తగ్గించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో ప్రజారోగ్యం, విద్యారంగాన్ని కాపాడాలనీ, జీడీపీలో రెండు శాతం నిధులు వాటికి కేటాయించాలని సూచించారు. వ్యవసాయరంగంలో ఉపాధి అవకాశాలను పెంచాలని కోరారు. ప్రజల కోసం కార్పొరేట్లపై పన్నులు వేయాలని చెప్పారు. వచ్చే బడ్జెట్లో ప్రజల కొనుగోలు శక్తి పెరిగేలా ప్రతిపాదనలు ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా ప్రయత్నాలు చేస్తామని విలేకర్లు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బీజేపీని ఓడించేవాళ్లకు తమ మద్దతు ఉంటుందన్నారు. బీజేపీని, టీఆర్ఎస్ను ఒకేలా చూడబోమని చెప్పారు. అదే సమయంలో ప్రజా సమస్యల పరిష్కారంలో టీఆర్ఎస్తోనూ రాజీపడబోమని స్పష్టంచేశారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఇబ్బందుల్లో ఉన్నాయనీ, వాటిని బయటపడేసే చర్యలేవీ మోడీ సర్కారు తీసుకోలేదని విమర్శించారు. వచ్చే బడ్జెట్ ద్వారా పేదలకు నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. మోడీ సర్వేలు అనేకం వస్తున్నాయనీ, వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ దెబ్బతినక తప్పదనీ, వాస్తవ ఫలితాలు మీరే చూస్తారని విలేకర్లు అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వామపక్ష శక్తుల ఐక్యత కోసం విస్త్రతంగా పనిచేస్తామని వివరించారు. జాతీయస్థాయిలో పార్టీ బలోపేతం కోసం వచ్చే ఏప్రిల్‌లో కేరళలో జరిగే అఖిలభారత పార్టీ మహాసభల్లో చర్చించనున్నట్టు తెలిపారు.