Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాసంఘాలు బలోపేతమవ్వాలి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
తుర్కయంజాల్ నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
ప్రజాసంఘాలు స్వతంత్రంగా ఎదుగుతూనే.. సమస్యల ప్రాతిపదికన భావసారూప్యతగల సం ఘాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి పోరాటా లు చేస్తూఐక్యతపై దృష్టిసారించాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా (తుర్కయంజాల్) కామ్రేడ్ సున్నం రాజయ్య నగర్‌లోని కామ్రేడ్ కుంజాబొజ్జి, కామ్రేడ్ మస్కు నర్సింహ్మ ప్రాంగణంలో నిర్వహించిన సీపీఐ(ఎం) మూడో రాష్ట్ర మహాసభ ముగింపు సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు. మిగతా ప్రజాసంఘాలను ఐక్యపర్చడంలో సీపీఐ(ఎం), దాని ప్రజాసంఘాలు మార్గదర్శిగా ఉండాలని సూచించారు. సరళీకరణ విధానాలతో ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల వినిమయదారీత త్వం పెరిగిందని చెప్పారు. సేవాభావం తగ్గిం దన్నారు. అదే సమయంలో ప్రజల మధ్య చీలిక స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు. అన్ని భూర్జువా పార్టీలు సంక్షేమపథకాలతో ప్రజలను మభ్యపెడు తున్నాయిగానీ ప్రజల దీర్ఘకాలిక సమస్యలను పట్టించుకోవడంలేదనీ, ఆర్థికంగా ఎదిగే కార్యక్ర మాలు చేపట్టటం లేదని చెప్పారు. ఈ నేపథ్యం లో ప్రజలను ఏకతాటిపై నిలిపి పోరాటాల్లోకి వచ్చేలా సీపీఐ(ఎం) ప్రజాసంఘాలు క్షేత్రస్థాయి నుంచి కృషి చేయాలని అన్నారు. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఆర్ఎస్ఎస్, సంఘపరివార్ విస్తరణను అడ్డుకునేందుకు, మతోన్మాద చర్యల ను తిప్పికొట్టేందుకు ప్రజలను చైతన్యపర్చా లన్నారు. ప్రజల సమస్యలను తీర్చేందుకు మేమున్నామనే భరోసాను ప్రజాసంఘాలు కల్పించాలని ఆయన సూచించారు.