Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేరళ రాష్ట్రంలోని కన్నూర్‌లో జరుగబోయే సీపీఐ(ఎం) 23వ జాతీయ మహాసభలకు తెలంగాణ ప్రతినిధుల బృందాన్ని రాష్ట్ర మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మొత్తం 27 మంది ప్రతినిధులతో కూడిన బృందాన్ని ప్రకటించింది.
జాతీయ మహాసభలకు సీపీఐ(ఎం) తెలంగాణ ప్రతినిధులు వీరే...
చుక్కరాములు, బి.వెంకట్, ఎం.సాయిబాబు, జూలకంటి రంగారెడ్డి, టి.జ్యోతి, పి.సుదర్శన్‌రావు, డీజీ నర్సింహారావు, జాన్‌వెస్లీ, మిడియం బాబూరావు, నంద్యాల నర్సింహారెడ్డి, ఆర్.సుధాభాస్కర్, వై.కిరణ్‌చంద్ర, పాలడుగు భాస్కర్, మల్లు లక్ష్మి, ఎండీ అబ్బాస్ రాష్ట్ర కేంద్రం నుంచి వెళ్లనున్నారు.
జిల్లాల నుంచి నున్నా నాగేశ్వరరావు, పొన్నం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, తుమ్మల వీరారెడ్డి, అన్నవరపు కనకయ్య, మల్లు నాగార్జునరెడ్డి, ఎండీ జహంగీర్, సాదుల శ్రీనివాస్, కాడిగళ్ల భాస్కర్, ఎం.కనకారెడ్డి, ఆముదాల మల్లారెడ్డి ఎంపికయ్యారు.
ఐదుగురు సభ్యులతో సీపీఐ(ఎం)కంట్రోల్ కమిషన్
ఐదుగురు సభ్యులతో సీపీఐ(ఎం) మహాసభ కంట్రోల్ కమిషన్‌ను ఎన్నుకుంది. దీనికి చైర్మెన్‌గా మిడియం బాబూరావు (రాష్ట్రకేంద్రం) వ్యవహరించనున్నారు. సభ్యులు ఉడుత రవీందర్ (రాష్ట్ర కేంద్రం), కల్యాణం వెంకటేశ్వరరావు (ఖమ్మం), బాల్‌రాజ్‌గౌడ్ (యాదాద్రి భువనగిరి) కె.నర్సమ్మ ఉన్నారు.