Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యంత సీనియర్ సారంపల్లి...
- పిన్నవయస్సుకురాలు నస్రీమా సుల్తానా
- కార్మిక, పేద, రైతు, వ్యవసాయకార్మికుల కుటుంబాల నుంచే 83 శాతం మంది
- ప్రజాపోరాటాలపై కేసుల్లో 269 మందికి జైలుజీవితానుభవం
తుర్కయంజాల్ నుంచి అచ్చిన ప్రశాంత్
సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలకు 583 మంది ప్రతినిధులకుగానూ 550 మంది పాల్గొన్నారు. మిగతా వారు అనారోగ్యం, ఇతర కారణాలతో నేరుగా హాజరుకాలేకపోయారు. అర్హతకమిటీ సభ్యుడు బుర్రిప్రసాద్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మొత్తం ప్రతినిధుల్లో 353 మంది పూర్తికాలపు కార్యకర్తలు ఉన్నారు. మహాసభకు హాజరైన వారిలో అత్యంత సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి(83) కాగా హన్మకొండ జిల్లా నుంచి ప్రతినిధిగా హాజరైన నస్రీమా సుల్తానా(21) అతిపిన్న వయస్కురాలు. ప్రతినిధుల్లో 33 శాతానికిపైగా పట్టభద్రులున్నారు. 83 శాతం మంది ప్రతినిధులు కార్మిక, వ్యవసాయ, రైతు కుటుంబాల నుంచి వచ్చివారే. ప్రజాసమస్యలపై పోరాడుతూ అరెస్టు అయి అత్యధికంగా జైలు జీవితాన్ని(రెండున్నరేండ్లు) గడిపిన వారిలో నిజామాబాద్ జిల్లాకు చెందిన పెద్ది వెంకట్రాములు ముందు వరుసలో ఉన్నారు. మొత్తం 269 మంది జైలుజీవితాన్ని గడిపారు. నిర్బంధాలను ఎదుర్కొంటూ ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడంలో భాగంగా ములుగు జిల్లాకు చెందిన ఎస్.కృష్ణారెడ్డి ఎనిమిదేండ్లపాటు అజ్ఞాత జీవితాన్ని గడిపారు. 55 మంది ప్రతినిధులు ఏదో ఒక సందర్భంలో ఆజ్ఞాతంలోకి వెళ్లినవారే. నూతన ఆర్థిక విధానాల ఫలితంగా పార్టీ వైపు రావడం లేదనే ప్రచారం ఒట్టి అబద్ధమని ప్రతినిధులను చూస్తేనే అర్థమవుతున్నది. 1996 నుంచి 2020 మధ్య కాలంలో పార్టీ సభ్యత్వాన్ని 65 శాతం మంది ప్రతినిధులు తీసుకున్నారు. ఈ కాలంలోనే సీపీఐ(ఎం) పూర్తికాలం కార్యకర్తలుగా 67 శాతం మంది వచ్చారు. యువత పార్టీ వైపు వచ్చేలా దృష్టి పెంచాలనేది మహాసభ ద్వారా అవగతమైంది. వచ్చిన ప్రతినిధుల్లో 40 ఏండ్ల లోపు వారు 24 శాతం మంది ఉన్నారు. మొత్తం ప్రతినిధుల్లో 82 మంది మహిళలున్నారు.