Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జూపాక శ్రీనివాస్, బోయిన్పల్లి రాము బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో నోటిఫికేషన్లు రాక రోజుకో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఏండ్ల తరబడి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు నోటిఫికేషన్లు రాకపోవడంతో మనస్థాపం చెంది ఉద్యోగం రాదేమోనని భయపడుతున్నారని తెలిపారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం మండ లానికి చెందిన ముత్యాల సాగర్ ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు.నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకోవద్దనీ, పోరాడి అటు మోడీ,ఇటు కేసీఆర్ మెడలు వంచి ఉద్యోగాలు సాధించుకుందామన్నారు.