Authorization
Tue April 08, 2025 10:56:11 am
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) చేపట్టిన గ్రామీణ నూతన ఆవిష్కర్తల గుర్తింపులో నాలుగు గ్రామ పంచాయతీలు ఎంపికయ్యాయి.. ఇంటింటా ఇన్నోవేటర్ - గ్రామీణ అవార్డుల కోసం నాలుగు గ్రామ పంచాయతీలు అంతిమంగా నిలిచాయి. ఆజాంనగర్ (జయశంకర్ భూపాలపల్లి జిల్లా), పాలంపేట్ (ములుగు), జయ్యారం (మహబూబాబాద్), పామిరెడ్డి పల్లి (వనపర్తి) గ్రామల్లో నూతన ఆవిష్కర్తలను ఆ గ్రామాల సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ సెక్రెటరీ కలిసి గుర్తించారు. స్థానిక అవసరాల మేరకు నూతన పరికరాలను కనిపెట్టే వారిని ప్రోత్సహించేందుకు గ్రామీణ అవార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్టు టీఎస్ఐసీ ఛీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత తౌతమ్ తెలిపారు. ఆజాంనగర్ కుచెందిన ఎదులాపురం శశిధర్ ఆటోమేటిక్‌గా వీధి దీపాలు ఆన్, ఆఫ్ అయ్యేందుకు పరికరాన్ని కనిపెట్టారు. పాలంపేట్కు చెందిన వొల్లాల సాయి కుమార్ విద్యుత్ షాక్‌ల నుంచి ప్రజలను కాపాడే దానిపై పని చేశారు. జయ్యారంకు చెందిన వెల్లే శ్రీనివాస్ సోలార్ విద్యుత్‌తో నడిచే ఆటోమేటిక్ అడ్వాన్స్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ను ఆవిష్కరించారు. పామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బరిగే సాయి ప్రణీత్ రావు బడికెళ్లే పిల్లల టాయిలెట్ సమస్యలకు పరిష్కారం చూపించారు.