Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్ ) ఆధ్వర్యంలో అక్టోబర్ 2021లో లండన్ వేదికగా జరిగిన టాక్ - చేనేత బతుకమ్మ, దసరా వేడుకల్లో సామాజిక బాధ్యతతో కరోనా సమయంలో ప్రాణాలు సైతం లెక్కచెయ్యకుండా సేవలందించిన నేషనల్ హెల్త్ సర్వీస్, ప్రపంచవ్యాప్త కోవిడ్ వారియర్లకు కతజ్ఞతలు తెలుపుతూ లండన్ టవర్ బ్రిడ్జి ఆకతిని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ సంస్థ బ్రిటన్ మహారాణి ప్రశంసలు అందుకుంది. టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం - ప్రభలత దంపతుల కుమార్తె నిత్యశ్రీ కూర్మాచలం ఆ సంస్థ నిర్వహించిన బతుకమ్మ వేడుకలను ప్రత్యేకించి నైషనల్ హెల్త్ సర్వీస్, ప్రపంచవ్యాప్త కోవిడ్ వారియర్లకు కతజ్ఞతలు తెలిపిన విధానం, ప్రవాస తెలంగాణ బిడ్డలు బతుకమ్మ వేడుకలు తదితర వివరాలతో బ్రిటన్ మహారాణికి ఒక లేఖ రాసింది. అందుకు స్పందనగా ఇటీవల మహారాణి కార్యాలయం నుంచి నిత్యశ్రీకి తిరిగి లేఖ అందింది. బతుకమ్మ వేడుకల ఫోటోలను మహారాణి చూసి సంతోషం వ్యక్తం చేసిందనీ, ముఖ్యంగా వేడుకల్లో నైషనల్ హెల్త్ సర్వీస్, ప్రపంచవ్యాప్త కోవిడ్ వారియర్లకు కతజ్ఞతలు తెలపడం ఎంతో బాగుందంటూ టాక్ సంస్థ కషిని అభినందిస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. తన దష్టికి ఈ విషయాలను తీసుకొచ్చిన నిత్యశ్రీని కూడా మహారాణి ప్రత్యేకంగా అభినందించారు. మహారాణి తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకల్ని అభినందించడం ఆనందంగా ఉందని టాక్ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.