Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్‌రావు సహా పలువురి నివాళి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మాజీ ఎమ్మెల్సీ, శాసనమండలి మాజీ చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి సతీమణి యాదమ్మ బుధవారం మరణించారు. రెండురోజుల క్రితం కడుపునొప్పితో ఆమె బాధపడ్డారు. దీంతో వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి టి హరీశ్‌రావు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళుర్పించారు. పాతూరి సుధాకర్‌రెడ్డిని పరామర్శించారు. ఆమె మరణానికి సంతాపం తెలిపారు. యాదమ్మ భౌతికకాయాన్ని సందర్శించి జనవిజ్ఞానవేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఉన్నత విద్యాపరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ అందె సత్యం నివాళులర్పించారు. ఆమె మరణం పట్ల పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి ఎం అంజిరెడ్డి, పత్రికా సంపాదకులు పి వెంకట్‌రెడ్డి సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. యాదమ్మ ఆకస్మిక మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం (టీఎస్‌జీసీసీఎల్‌ఏ-475) అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాతూరి సుధాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లినపుడు ఆమె ఆప్యాయంగా పలకరించి అందరికీ భోజనం ఏర్పాటు చేసే వారనీ, కష్టసుఖాలను సానుభూతితో విని ధైర్యం చేప్పేవారని గుర్తు చేశారు.