Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గణతంత్ర దినోత్సవంలో ఎస్బీఐ సీజీఎం
నవతెలంగాణ - హైదరాబాద్
నిస్వార్థ భావంతో స్వాతంత్య్రం కోసం పని చేసిన త్యాగధనుల సేవలను భారత దేశం మరవలేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రన్ అన్నారు. బుధవారం కోటిలోని ఆ బ్యాంక్ కార్యాలయంలో 73వ గణంతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జింగ్రన్ జాతీయ జెండా ఎగరవేసి సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. నేడు అనేక సవాళ్ల మధ్య దేశాన్ని రక్షిస్తున్న సైన్యానికి ధన్యవాదులు తెలిపారు. ప్రస్తుత వైరస్ సంక్షోభ సవాళ్లను ఎదుర్కొవడానికి దేశ వ్యాప్తంగా పౌరులకు 150 కోట్ల కోవిడ్ డోస్‌లను అందించిన విషయాన్ని గుర్తు చేశారు. భారత్ వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచంలోనే విశేష గుర్తింపును పొందిందన్నారు. సంక్షోభ కాలంలో ఎస్బీఐ అనేక మంది బాదితులకు ఆహారం, నిత్యావసరాలు, ఆక్సిజన్ ప్లాంట్లు, వైద్య పరికరాలు అందించి విశాల హృదయాన్ని చాటుకుందన్నారు.