Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గణతంత్ర దినోత్సవ వేడుకలను పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు నిర్వహించారు. విద్యుత్ సౌధలో టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పించారు. రాష్ట్రంలో విద్యుత్‌రంగం పురోభివృద్ధి సాధించిందని వివరించారు. కార్యక్రమంలో టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
టీఎస్ఆర్టీసీలో...
టీఎస్ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లో ఆ సంస్థ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. ప్రయాణీకులు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ నూతన వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
సింగరేణిలో...
సింగరేణి కాలరీస్ ప్రధాన కార్యాలయం సింగరేణి భవన్లో ఆ సంస్థ సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ అభివృద్ధిని వివరించారు. ఉత్తమ అధికారిగా ఎంపికైన డీజీఎమ్ (ఈ అండ్ ఎమ్) చౌటుపల్లి ప్రభాకర్‌ను సన్మానించారు. పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.