Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రైస్‌బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తున్నదని గవర్నర్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్ర రైతాంగం పంటల దిగుబడిని సాధించి, ఆదర్శంగా నిలిచిందన్నారు. దీనికి రాష్ట్ర రైతాంగానికి సెల్యూట్ చేస్తున్నట్టు చెప్పారు. రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్ రాజ్‌భవన్‌లో బుధవారంనాడామె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం అన్నిరంగాల్లోనూ పురోభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో ఫార్మాసిటీ, ఐటీహబ్, మెడికల్ హబ్‌ల ఏర్పాటు జరుగుతున్నదని తెలిపారు. అత్యుత్తమ రాజ్యాంగం అందించిన దార్శనికులకు నివాళులు అర్పించారు. దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించారు. అంతకుముందు ఆమె పరేడ్ గ్రౌండ్స్‌లోని యుద్ధ వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. రాజ్‌భవన్ కార్యక్రమానికి హాజరైన అంబులెన్స్ డ్రైవర్లు, పారిశుద్ద్య కార్మికులు, ఆశావర్కర్లతో ఆమె ముచ్చటించారు.