Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఎం కేసీఆర్ అధికార నివాసమైన ప్రగతి భవన్లో బుధవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీఎం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటిం చారు. పలువురు ప్రజాప్రతినిధులు, సీఎస్, డీజీపీ, సీఎంవో అధికారులు, తదితర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం పెరేడ్ గ్రౌండ్లోని అమర జవానుల స్మారక స్థూపం వద్ద సీఎం జ్యోతి ప్రజ్వలన చేసి అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు.