Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు
హైదరాబాద్ : కాంక్రీట్ కాన్సెప్ట్స్ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్టు ఆర్టిఫీషియల్ స్టోన్ తయారీలో ఉన్న ఆర్ట్ స్టోన్ ప్రకటించింది. హైదరాబాద్‌లోని లక్డికపూల్ దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఫ్రాంచైజీ విధానంలో స్టోర్లను తెరవడానికి సన్నద్దం అవుతున్నాయని ఆ కంపెనీ వ్యవస్థాపకులు మహమ్మద్ మునీర్ అహ్మద్, యరమల కష్ణా రెడ్డి తెలిపారు. శంషాబాద్ వద్ద మూడు ఎకరాల్లో తయారీ కేంద్రం నెలకొల్పామ న్నారు. ఇక్కడ ఆర్టిఫీషియల్ స్టోన్ ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపారు. వినియోగదారులు కోరిన విధంగా వేలాది డిజైన్స్‌లో ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఆర్టిఫీషియల్ స్టోన్స్ రూపొందిస్తామని వెల్లడించారు.