Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గత నెలలో విడుదలై సంచలనం సష్టిస్తున్న 'ఇగురం' కథా సంపుటి పుస్తక రచయిత గంగాడి సుధీర్ రెడ్డిని సీఎం కేసీఆర్ అభినందించారు. ఆయన గురువారం మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి సీఎంను ప్రగతి భవన్లో మర్యాద పూర్వకంగా కలిశారు. గంగాడి సుధీర్ రెడ్డిని గుర్తుపట్టిన సీఎం, ఇగురం రచయితవు కదా... చాలా బాగా రాస్తున్నావ్, కీప్ రైటింగ్ అంటూ అభినందించారు. సీఎం స్వయంగా గుర్తుపట్టడం, ఇగురం పుస్తకం గురించి విన్నాను, చదివాను అని స్వయంగా ఆయనే తనతో ప్రస్తావించారని రచయిత మీడియాతో ఆనందాన్ని పంచుకున్నారు. తన తొలి పుస్తకం ఇగురం ముఖ్యమంత్రి వరకు వరకూ చేరడం, ఆయన దాన్ని చదవడం, అభినందించడం తన జీవితంలో మరిచిపోలేని రోజు అని, గొప్ప అనుభూతి కలిగించిందని గంగాడి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు ఉన్న విబిన్న సంస్కృతి, తెలంగాణకున్న ఘనమైన సారస్వత వారసత్వం, సాహితీ సుక్షేత్రమే తన రచనలకు ఆలంబన అని తెలిపారు. మంచి సాహిత్యాన్ని ఆదరిస్తున్న పాఠకులకు, పాలకులకు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ణతలు తెలిపారు.