Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రజత్‌కుమార్‌కు రేవంత్ ట్వీట్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ కూతురు వివాహానికి డబ్బులెవరు స్పాన్నర్ చేశారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈమేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు. ఫైవ్‌స్టార్ సౌకర్యాలతో అత్యంత ఖరీదైన వివాహానికి దాతలు ఎవరు? ఇది క్విడ్ ప్రోకో కాదా? అని ప్రశ్నించారు. ఒక మీడియా సంస్థ సేకరించిన డాక్యుమెంటరీ సాక్ష్యం ప్రకారం ఒక పెద్ద సంస్థ షెల్ కంపెనీ బిగ్‌వేవ్ ఇన్ఫ్రా ప్రయివేట్ లిమిటెడ్ ద్వారా ఈ ఖరీదైన వివాహ ఏర్పాట్లు చేసినట్టు స్పష్టంగా తెలుస్తున్నదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ సీనియర్ అధికారికి, నీటి పారుదల కాంట్రాక్టర్ మధ్య అనుబంధంపై విచారణకు ఆదేశిస్తారా? అని సర్కారును ప్రశ్నించారు.